EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రచార పర్వమే కాదు..ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టిస్తాం..

    Author REPUBLIC HINDUSTHAN | 16 May 2022, 11:18 AM |


    టి.ఆర్.ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా  వారియర్స్



    రిపబ్లిక్ హిందుస్థాన్,ఇచ్చోడ : బోథ్ నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ సోషల్ మీడియా  వారియర్స్ సమయత్త సమావేశం సోమవారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములోని ఒక ప్రయివేట్ పాఠశాలలో జరిగింది. ఈ సమావేశానికి బోథ్   శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు  తనయుడు,యువ నాయకుడు కె.ఆర్.విశ్వజిత్ నాయక్,సూర్య ప్రకాష్ రాథోడ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ దాసరి భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బోథ్,నెరడిగొండ, బజార్ హత్నూర్,ఇచ్చోడ,గుడిహత్నూర్,సిరికొండ, తలమడుగు,తాంసి మండలాల సోషల్ మీడియా కన్వీనర్లు,ట్.ఆర్ ఎస్ యూత్ ఫోర్స్,హాజరయ్యారు.  ఈ సమావేశములో టి.ఆర్.ఎస్ పథకాల ప్రచారం గురించి,ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు  చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం గురించి,ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం గురించి చర్చించారు.  ఇక నుంచి విస్తృత స్థాయిలో ప్రచారం మొదలు పెట్టి టి.ఆర్.ఎస్ సోషల్ మీడియా తడాఖా చుహిస్తామని శపథం చేశారు. కె.ఆర్.విశ్వజిత్ నాయక్ మాట్లాడుతూ పార్టి కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.


    ఇవి కూడా చదవండి