EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వడ్డీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారుల అరెస్ట్

    Author REPUBLIC HINDUSTHAN | 21 Jun 2026, 10:25 PM | Crime, TELANGANA
    వడ్డీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారుల అరెస్ట్

    *పత్రికా ప్రకటన*
    ఆదిలాబాద్ జిల్లా,
    ఇచ్చోడ పోలీస్ స్టేషన్,
    జూన్ 21 :-


    *ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన బాధితుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులు*

    వడ్డీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారుల అరెస్ట్ - Additional Image

    *నిందితుల ఇంటి నుండి భారీ మొత్తంలో ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్ పత్రాలు స్వాధీనం*

    *రెండు కోట్ల విలువైన 90 ప్రామిసరీ నోట్లు,26 కాళీ ప్రామిసరీ నోట్లు, 366 చెక్కులు స్వాధీనం.*

    *అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు*

    *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*

    ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తూ, బెదిరింపులు, కులదూషణలకు పాల్పడుతున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై జిల్లా పోలీసు శాఖ ఉక్కుపాదం మోపిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఈ మేరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఇద్దరు నిందితులను (తండ్రి కొడుకులను) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పత్రికా సమావేశంలో వెల్లడించారు.

    వివరాల్లోకి వెళితే, ఇచ్చోడకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆర్థిక అవసరాల నిమిత్తం నిందితుడు అర్రోల్ల వెంకటరమణ వద్ద రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చే సమయంలో బాండ్ పేపర్లు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకున్న నిందితుడు, బాధితుడు అప్పు మొత్తాన్ని చెల్లించినప్పటికీ అదనంగా భారీ మొత్తంలో వడ్డీ డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న చెక్కులు, ప్రామిసరీ నోట్లు దుర్వినియోగం చేస్తానని, పరువు తీస్తానని బెదిరిస్తూ అదనంగా రూ.2 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

    ఇవి కూడా చదవండి

    అలాగే నిందితులు బాధితుడిని కులం పేరుతో దూషిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేసి మానసికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విధంగా మరికొంతమంది ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తుల వద్ద కూడా అధిక వడ్డీలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    *అరెస్ట్ చేసిన నిందితులు :-*

    A1. అర్రోల్ల వెంకటరమణ, తండ్రి లస్మన్న, వయస్సు 56 సంవత్సరాలు, స్వగ్రామం కుమారి గ్రామం, ఇచ్చోడ మండలం, ప్రస్తుతం హనుమాన్ నగర్, ఇచ్చోడ నివాసి.


    A2. అర్రోల్ల ఉపేందర్, తండ్రి వెంకటరమణ, వయస్సు 33 సంవత్సరాలు, స్వగ్రామం కుమారి గ్రామం, ఇచ్చోడ మండలం, ప్రస్తుతం హనుమాన్ నగర్, ఇచ్చోడ నివాసి.

    *నిందితుల ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు :-*

    ➤ ప్రామిసరీ నోట్లు – 90
    ➤ ఖాళీ బాండ్ పేపర్లు – 26
    ➤ చెక్కులు – 366
    ➤ పట్టాదార్ పాస్ పుస్తకాలు – 7
    ➤ ఆధార్ కార్డులు – 6
    ➤ బ్యాంక్ పాస్ పుస్తకాలు – 4
    ➤ పాన్ కార్డు – 1

    నిందితులు పలువురు వ్యక్తుల నుండి అప్పులకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకొని అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పై డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

    ప్రజలు అక్రమ వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు.

    వీరి ద్వారా బాధింపబడిన ఎవరైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రజలు అధిక వడ్డీలపై ఎలాంటి సమస్యలున్న సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఇచ్చోడ ఇన్స్పెక్టర్ కె నరేష్ కుమార్, సిసిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.