EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న రేషన్ డీలర్ పట్టివేత

    Author REPUBLIC HINDUSTHAN | 04 Jul 2026, 09:24 PM | Crime, TELANGANA
    రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న రేషన్ డీలర్ పట్టివేత

    *రేషన్ కార్డు, బయోమెట్రిక్ ధ్రువీకరణ లేకుండానే బియ్యం విక్రయం*

    *80 కిలోల పీడీఎస్ బియ్యం, మొబైల్ ఫోన్, స్టాక్ రికార్డులు స్వాధీనం*

    *వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో బి. సునీల్ కుమార్*

    ఇవి కూడా చదవండి

    ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న ప్రజా పంపిణీ రాయితీ (PDS) బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న రేషన్ డీలర్‌ను వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నట్లు ఎస్‌హెచ్‌వో బి. సునీల్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రేషన్ డీలర్ సునీల్ కుమార్ జెన్నవర్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ రేషన్ కార్డు లేని వ్యక్తులకు బయోమెట్రిక్ ధ్రువీకరణ లేకుండానే పీడీఎస్ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా బడ్కా మొహల్లాకు చెందిన అబ్దుల్ ఖయ్యూం అనే వ్యక్తికి రేషన్ బియ్యాన్ని విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులు తమ తప్పును అంగీకరించినట్లు తెలిపారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి 80 కిలోల పీడీఎస్ రేషన్ బియ్యం, అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించిన నార్జో 70ఎక్స్ 5జీ మొబైల్ ఫోన్, సంబంధిత స్టాక్ రికార్డులు, రసీదులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో బి. సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.