రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న రేషన్ డీలర్ పట్టివేత

*రేషన్ కార్డు, బయోమెట్రిక్ ధ్రువీకరణ లేకుండానే బియ్యం విక్రయం* *80 కిలోల పీడీఎస్ బియ్యం, మొబైల్ ఫోన్, స్టాక్ రికార్డులు స్వాధీనం* *వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో బి. సునీల్ కుమార్* ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న ప్రజా పంపిణీ రాయితీ (PDS) బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న రేషన్ డీలర్‌ను వన్‌టౌన్ పోలీసులు పట్టుకున్నట్లు ఎస్‌హెచ్‌వో బి. సునీల్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రేషన్ డీలర్ సునీల్ కుమార్ జెన్నవర్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ రేషన్ కార్డు లేని వ్యక్తులకు బయోమెట్రిక్ ధ్రువీకరణ లేకుండానే పీడీఎస్ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు....