ప్రచార పర్వమే కాదు..ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టిస్తాం..

టి.ఆర్.ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా  వారియర్స్ రిపబ్లిక్ హిందుస్థాన్,ఇచ్చోడ : బోథ్ నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ సోషల్ మీడియా  వారియర్స్ సమయత్త సమావేశం సోమవారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములోని ఒక ప్రయివేట్ పాఠశాలలో జరిగింది. ఈ సమావేశానికి బోథ్   శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు  తనయుడు,యువ నాయకుడు కె.ఆర్.విశ్వజిత్ నాయక్,సూర్య ప్రకాష్ రాథోడ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ దాసరి భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బోథ్,నెరడిగొండ, బజార్ హత్నూర్,ఇచ్చోడ,గుడిహత్నూర్,సిరికొండ, తలమడుగు,తాంసి మండలాల సోషల్ మీడియా కన్వీనర్లు,ట్.ఆర్ ఎస్ యూత్ ఫోర్స్,హాజరయ్యారు.  ఈ సమావేశములో టి.ఆర్.ఎస్ పథకాల ప్రచారం గురించి,ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు  చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం...