EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్కూల్ కం దుకాణం....   ప్రైవేట్ స్కూళ్ల బుక్స్ మాఫియా..!

    Author REPUBLIC HINDUSTHAN | 18 Jul 2026, 07:06 PM |
    స్కూల్ కం దుకాణం....   ప్రైవేట్ స్కూళ్ల బుక్స్ మాఫియా..!

    ప్రైవేట్ స్కూళ్ల పగటి దోపిడీ.. ఎల్‌కేజీ పుస్తకాలకే రూ. 5 వేలు!

    అధికారుల తనిఖీల ఏమయ్యాయి.. !?

    ఫిర్యాదు చేయడం కోసం పూర్తి వార్తను చదవండి... మీ హక్కులు తెలుసుకోండి...

    ఆదిలాబాద్: ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా, అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల తీరు మారడం లేదు. చదువుల పేరుతో పసిపిల్లల తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఒక  ప్రైవేట్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి ప్రకటించిన ఫీజుల పట్టిక చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

    అడ్మిషన్ ఫీజు రూ. 5 వేలు.. ఆకాశన్నంటుతున్న వార్షిక ఫీజులుఈ స్కూల్లో అడుగుపెట్టాలంటేనే ముందుగా ఎంట్రీ/అడ్మిషన్ ఫీజు కింద రూ. 5,000  లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాలి.

    ఇక వార్షిక ఫీజుల (Annual Fees) విషయానికి వస్తే నర్సరీకి రూ. 18,500 నుండి 20 వేల వరకు ,   ఎల్‌కేజీ (L.K.G) కి రూ. 19,700 నుండి 23 వేల వరకు ,  యూకేజీ (U.K.G) కి రూ. 20,900 నుండి 26 వేల వరకు గా నిర్ణయించారు. ఇక ప్రైమరీ సెక్షన్‌కు వెళితే 1వ తరగతికి రూ. 24,700 - 27700 వరకు ,  3వ తరగతికి రూ. 27,200 - 30000 వరకు ,  ఇలా పెరుగుతూ వెళ్లి 6వ తరగతికి ఏకంగా రూ. 32,000 - 35000 వేల వరకు వసూలు చేస్తున్నారు.

    పుస్తకాల పేరుతో అక్షరాల దోపిడీ: స్కూల్ ఫీజుల భారం ఒక ఎత్తైతే, పుస్తకాల పేరుతో బాదుతున్న వైనం మరింత దారుణంగా ఉంది. ఏబీసీడీలు గీతలు గీసుకునే నర్సరీ పిల్లల పుస్తకాలకు రూ. 3,050 వసూలు చేస్తుండగా.. ఎల్‌కేజీకి రూ. 3,950, యూకేజీకి ఏకంగా రూ. 4,950 డిమాండ్ చేస్తున్నారు.అంతేకాకుండా పై తరగతులకు వెళ్లే కొద్దీ ఈ పుస్తకాల రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి.
    • 1వ తరగతి - రూ. 6,500 - 7600
    • 2వ తరగతి - రూ. 6,700 - 7800
    • 3వ తరగతి - రూ. 7,200 - 8200
    • 4వ తరగతి - రూ. 8,200 - 9200
    • 5వ తరగతి - రూ. 8,300 - 9300
    • 6వ తరగతి - రూ. 8,500 - 9500  లేదా అంతకంటే ఎక్కువ కేవలం నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కోసమే ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేయడం తల్లిదండ్రులకు తీవ్ర గుదిబండగా మారింది.

    విద్యాశాఖ నిబంధనలు ఏమైనట్లు?పుస్తకాలను స్కూల్ ఆవరణలో అమ్మకూడదని, అడ్వాన్స్ ఫీజులు వసూలు చేయకూడదని, లాభాపేక్ష లేకుండా పుస్తకాలు అందించాలని విద్యాశాఖ మరియు మానవ హక్కుల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని  స్కూళ్లు వాటిని బేఖాతరు చేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు (DEO), మండల విద్యాధికారులు స్పందించి, ఇలాంటి ప్రైవేట్ స్కూళ్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, దోపిడీకి అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

    ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాంల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ ఉన్న అది బయట ఎక్కడ కనిపించడం లేదు.... – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్న ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు...

    విద్యార్థుల తల్లిదండ్రులు పిర్యాదు చేస్తే ఎక్కడ తమ పిల్లలను టార్గెట్ చేస్తారో అని చెప్పడానికి ముందుకు రావడం లేదు..
    మంచి విద్య అందిస్తారని తల్లిదండ్రులు కష్టపడి ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తే ... అదే అదునుగా స్కూల్ యాజమాన్యాలు ... నిలువు దోపిడి ప్రారంభించాయి...

    రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల జేబులకు చిల్లు.. కోట్ల రూపాయల దోపిడీపై ఆరోపణలు

    పాఠశాలల్లో పుస్తకాల అమ్మకాలు.....
    బుక్స్, యూనిఫాం తప్పనిసరిగా తమ దగ్గరే కొనాలంటూ ఒత్తిడి.. రశీదులు లేకుండా నగదు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు

    రిపబ్లిక్ హిందుస్థాన్ ప్రత్యేక కథనం

    రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారుతోందనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల పేరుతో ప్రారంభమయ్యే ఆర్థిక భారం, పుస్తకాలు, యూనిఫాంలు, స్టేషనరీ పేరుతో తల్లిదండ్రులపై మరింత పెరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదైనా భరిస్తున్న మధ్యతరగతి, పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

    ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూళ్లు తమకు అనుబంధంగా ఉన్న బుక్ స్టాళ్లు లేదా ప్రత్యేక కౌంటర్ల ద్వారా మాత్రమే పుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. బయట మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే పుస్తకాలను కూడా అధిక ధరలకు విక్రయిస్తూ, "ఇవి మా స్కూల్ స్పెషల్ బుక్స్" అంటూ చెప్పి తప్పనిసరిగా కొనాల్సిందేనని షరతులు విధిస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    రశీదులు లేకుండా నగదు వసూళ్లు..?

    అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసినప్పటికీ కొన్ని చోట్ల సరైన బిల్లు లేదా జీఎస్టీ రశీదు ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు చెల్లించిన మొత్తానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేకుండా పోతున్నాయని వారు చెబుతున్నారు. రశీదు లేకపోవడంతో భవిష్యత్తులో ఫిర్యాదు చేయాలన్నా, డబ్బు తిరిగి కోరాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది.

    ఫీజుల్లో బుక్స్ ఉన్నాయా..? వేరే వసూళ్లు ఎందుకు..?

    విద్యా సంస్థలు ప్రకటించే ఫీజు నిర్మాణంలో ఏ అంశాలు ఉన్నాయో స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే అనేక పాఠశాలల్లో ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు, డైరీలు, ఐడీ కార్డులు, ఇతర సామగ్రి పేరుతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఒకే విద్యార్థిపై వేల రూపాయల అదనపు భారం పడుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఇది కోట్ల రూపాయల వ్యాపారంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    ఇవి కూడా చదవండి

    పాఠశాలల వద్దే ప్రత్యేక బుక్ కౌంటర్లు

    కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల సమీపంలో ప్రత్యేక బుక్ కౌంటర్లు ఏర్పాటు చేసి, అక్కడి నుంచే పుస్తకాలు కొనాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారని చెబుతున్నారు. బయట కొనుగోలు చేసిన పుస్తకాలు అనుమతించబోమని లేదా వేరే ఎడిషన్ పనికిరాదని చెప్పి ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

    నిబంధనలు అమలవుతున్నాయా..?

    ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలు, ఇతర వసూళ్ల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించడం, నిబంధనలను పాటించడం అవసరమని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ అంశాలపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చినా సమగ్ర విచారణ జరగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

    విద్య వ్యాపారంగా మారకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పుస్తకాలు, యూనిఫాంలను ఒకే చోట కొనాలని బలవంతం చేసే పాఠశాలలపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సంఘాలు కోరుతున్నాయి. అలాగే పుస్తకాలు, యూనిఫాంల విక్రయాలపై తప్పనిసరిగా అధికారిక రశీదులు ఇవ్వాలని, ఫీజు నిర్మాణాన్ని పూర్తిగా పారదర్శకంగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

    రిపబ్లిక్ హిందుస్థాన్ అభిప్రాయం

    విద్య ఒక సేవ. అది వ్యాపారంగా మారి తల్లిదండ్రులపై అనవసర ఆర్థిక భారం మోపే పరిస్థితి రాకూడదు. పాఠశాలలు చట్టాలు, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరించడం అవసరం. అదే సమయంలో అక్రమ వసూళ్లు, రశీదులు ఇవ్వకపోవడం, ఒకే చోట కొనుగోలు చేయాలని బలవంతం చేయడం వంటి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే, సంబంధిత అధికారులు నిష్పాక్షికంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీసి, నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

    ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక పాఠశాలల్లో అయితే నేరుగా పాఠశాలలోనే పుస్తకాలు అమ్మకాలు చేస్తున్నారు. 4 తరగతి పుస్తకాల ధర గతేడాది ₹9500... అయితే కొన్ని సార్లు వీటికి సంబంధించిన రశీదు కూడా ఇవ్వరు..

    ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాంల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ ఉన్న అది బయట ఎక్కడ కనిపించడం లేదు.... – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్న ఉన్న ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు...

    విద్యార్థుల తల్లిదండ్రులు పిర్యాదు చేస్తే ఎక్కడ తమ పిల్లలను టార్గెట్ చేస్తారో అని చెప్పడానికి ముందుకు రావడం లేదు..

    **హైదరాబాద్:**
    రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రి విక్రయాల పేరిట సాగుతున్న వ్యాపార దోపిడీపై తెలంగాణ విద్యాశాఖ మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎల్‌కేజీ (LKG), యూకేజీ (UKG) వంటి ప్రాథమిక తరగతుల పిల్లల పుస్తకాలకే రూ. 5,000 నుండి రూ. 9,000 వరకు వసూలు చేస్తున్నారన్న తల్లిదండ్రుల ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
    పాఠశాలలు విద్యా సంస్థలుగా కాకుండా కమర్షియల్ వ్యాపార కేంద్రాలుగా మారుతుండటంపై విద్యాశాఖ నిబంధనలను కఠినతరం చేసింది.

    ప్రభుత్వం విధించిన ప్రధాన నిబంధనలు ఇవే:

    పాఠశాల ఆవరణలో విక్రయాలు నిషేధం:
       ప్రైవేట్ పాఠశాలల ప్రాంగణంలో యూనిఫాంలు, షూస్, బెల్టులు, టైలు మరియు ఇతర స్టేషనరీ వస్తువులను నేరుగా విక్రయించడాన్ని జిల్లా విద్యాశాఖాధికారులు (DEO) పూర్తిగా నిషేధించారు.

    లాభాపేక్ష లేని విక్రయాలు (No-Profit, No-Loss):
       ఒకవేళ పాఠశాల యాజమాన్యాలు పుస్తకాలు లేదా నోట్ బుక్స్ అందిస్తుంటే, వాటిని కచ్చితంగా 'లాభం లేదా నష్టం లేని' ప్రాతిపదికన మాత్రమే అందించాలి. మార్కెట్ ధరల కంటే ఎక్కువ వసూలు చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది.

    * **నిర్దేశిత దుకాణాల్లో కొనాలని బలవంతం చేయకూడదు:**
       తమ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పుస్తకాలు, దుస్తులను స్కూల్ యాజమాన్యం సూచించిన నిర్దేశిత వెండర్స్ (Specific Vendors) వద్దే కొనాలని ఒత్తిడి చేయకూడదు. బహిరంగ మార్కెట్‌లో తమకు నచ్చిన చోట, తక్కువ ధరకు కొనుగోలు చేసే పూర్తి స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఉంటుంది.

    ముందస్తు ఫీజుల వసూళ్లపై ఆంక్షలు:
       విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే లేదా అడ్మిషన్ల సమయంలోనే పుస్తకాలు, యూనిఫాంల పేరుతో భారీ మొత్తంలో అడ్వాన్సులు వసూలు చేయడాన్ని విద్యాశాఖ తప్పుబట్టింది.

    మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం
    పాఠశాలలు 50 శాతం కంటే ఎక్కువ ఫీజులను, పుస్తకాల డబ్బులను అడ్వాన్స్‌గా వసూలు చేస్తున్నాయనే అంశంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. విద్యను ఒక వ్యాపార వస్తువుగా మార్చడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు (Article 21) విరుద్ధమని కమిషన్ స్పష్టం చేసింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా వేధిస్తున్న స్కూళ్లపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులను (DEO) ఆదేశించింది.

    తల్లిదండ్రులకు విద్యాశాఖ విజ్ఞప్తి
    పాఠశాల యాజమాన్యాలు పుస్తకాలు లేదా యూనిఫాంల కోసం అధిక ధరలు డిమాండ్ చేసినా, నిర్దేశిత దుకాణాల్లోనే కొనాలని బలవంతం చేసినా, దానికి సంబంధించిన పక్కా రసీదులు (Bills) లేదా పాఠశాల సర్క్యులర్ల ఆధారాలతో నేరుగా ఆయా జిల్లాల డీఈఓ (DEO) కార్యాలయాల్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని ప్రభుత్వం హెచ్చరించింది.