EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కోట్ల రూపాయల మున్సిపాలిటీ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కొట్టేయాలనే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్టు

    Author REPUBLIC HINDUSTHAN | 16 May 2025, 08:27 PM |







    • మున్సిపల్/ప్రభుత్వ భూములను ఆక్రమించే కబ్జాదారులు - ఖబర్దార్


    • మున్సిపాలిటీ భూమికి అక్రమ దస్తావీదులు సృష్టించి, నివాసముంటున్నట్టుగా ధ్రువీకరించి, నకిలీ పత్రాలు సృష్టించిన నిందితుడు.


    • అక్రమ పద్ధతిలో హౌస్ నెంబర్ కేటాయించి రిజిస్ట్రేషన్ కు సహకరించిన మున్సిపల్ సిబ్బందిపై విచారణ.


    • ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదు, ఒకరి అరెస్టు, విచారణ.

      - వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.





    *
    ఆదిలాబాద్ : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపే దిశగా అక్రమ కార్యకలాపాలను అడ్డుకునే దిశగా కృషి చేస్తున్నారు .

    ఇవి కూడా చదవండి



    నిందితుల వివరాలు
    A1) సయ్యద్ షాబుద్దీన్ s/o మఖాన్ జి, భుక్తాపూర్.(పరారీ)
    A2 ) మహమ్మద్ అక్రమ్ s/o ఇస్మాయిల్ R/o భుక్తాపూర్.(అరెస్ట్)



    ఇలాంటి సందర్భంలో ఆదిలాబాద్ పట్టణంలోని
    నిందితుడు A2 అక్రమ్ భుక్తాపూర్ నందు గల మున్సిపాలిటీ ఖాళీ స్థలాన్ని ఆక్రమించాలని దురుద్దేశంతో తన బంధువైన సయ్యద్ షాబుద్దీన్ పై అక్రమ దస్తావేజులు సృష్టించి మున్సిపాలిటీ ద్వారా 35 సంవత్సరములుగా నివసిస్తున్నాను అంటూ అక్రమ పద్ధతిలో హౌస్ నంబర్ ను తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అతనిపై ఫిర్యాదు చేయగా ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో అతనిపై క్రైమ్ నెంబర్ 96/25తో అండర్ సెక్షన్ 329 (3), 318 (4), 336 (3), 340 (2) బి ఎన్ ఎస్ సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అక్రమ పద్ధతిలో నకిలీ దస్తావీజులు సృష్టించి మున్సిపాలిటీ స్థలాన్ని కాజేయాలని దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.
    ఈ బుక్తాపూర్ నందుగల 469.44 స్క్వేర్ యాడ్స్ మున్సిపాలిటీ స్థలం నకు హౌస్ నెంబర్ 6-6-36/2/1 కేటాయించడం జరిగింది, మున్సిపాలిటీ సిబ్బంది పాత్ర పై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని ఒకవేళ మున్సిపాలిటీ సిబ్బంది పాత్ర తెలీనట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. ప్రభుత్వ మరియు మున్సిపాలిటీ భూములను కబ్జా చేయాలని ఆక్రమించాలని అక్రమ పద్ధతులలో రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి పై ఖబర్దార్ అంటూ ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు.




    వీరందరిపై కఠినమైన నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులను నమోదు చేస్తూ, పిడి ఆక్ట్ నమోదుకు సైతం వెనుకాడబోడమని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాదారుల చర నుండి ప్రభుత్వ భూములను విడిపించడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పై ఉందంటూ దానికి జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.