EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • Education: గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు పొడగించాలి.<br>బహుజన టీచర్స్ ఫెడరేషన్

    Author REPUBLIC HINDUSTHAN | 30 Jan 2025, 03:10 PM |
    Education: గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు పొడగించాలి.<br>బహుజన టీచర్స్ ఫెడరేషన్


    రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ : బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పెంచాలని అదే విధంగా విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు త్వరగా మంజూరు చెయ్యాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు  కాంబ్లె విజయ్ కుమార్ గురువారం  ఆదిలాబాద్ జిల్లా అదనపు పాలనాధికారి శ్రీ శ్యామల దేవి ని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంబ్లే విజయ్ కుమార్ మాట్లాడుతు  5 వ తరగతి గురుకుల ప్రవేశ అర్హత పరీక్షల కోసం చాలామంది విద్యార్థులు సిద్ధంగా వున్నారు. ఈ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసే సమయానికి  ఆదాయ ధ్రువీకరణపత్రం మరియు    కుల ధ్రువీకరణ పత్రం  కావాలి. అందుకు చాలామంది విద్యార్థులు ఆ పత్రాల గురించి మీసేవ కేంద్రాలద్వారా దరఖాస్తు  చేసుకున్నారు. కానీ  సర్టిఫికెట్స్ కుల ధ్రువీకరణ పత్రం అందక పోవడం తో చాలా మంది విద్యార్థులు గురుకుల ప్రవేశ అర్హత పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. కావునా ఈ విషయం గమనించి   త్వరగా అందేటట్లు మరియు గురుకుల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును కూడా పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది.