🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 30 Jan, 2025 | Page: 1

Education: గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు పొడగించాలి.<br>బహుజన టీచర్స్ ఫెడరేషన్


రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ : బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పెంచాలని అదే విధంగా విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు త్వరగా మంజూరు చెయ్యాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు&nbsp; కాంబ్లె విజయ్ కుమార్ గురువారం&nbsp; ఆదిలాబాద్ జిల్లా అదనపు పాలనాధికారి శ్రీ శ్యామల దేవి ని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంబ్లే విజయ్ కుమార్ మాట్లాడుతు&nbsp; 5 వ తరగతి గురుకుల ప్రవేశ అర్హత పరీక్షల కోసం చాలామంది విద్యార్థులు సిద్ధంగా వున్నారు. ఈ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసే సమయానికి&nbsp; ఆదాయ ధ్రువీకరణపత్రం మరియు&nbsp;&nbsp;&nbsp; కుల ధ్రువీకరణ పత్రం&nbsp; కావాలి. అందుకు చాలామంది విద్యార్థులు ఆ పత్రాల గురించి మీసేవ కేంద్రాలద్వారా దరఖాస్తు&nbsp; చేసుకున్నారు. కానీ&nbsp; సర్టిఫికెట్స్ కుల ధ్రువీకరణ పత్రం అందక పోవడం తో చాలా మంది విద్యార్థులు గురుకుల ప్రవేశ అర్హత పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. కావునా ఈ విషయం గమనించి&nbsp;&nbsp; త్వరగా అందేటట్లు మరియు గురుకుల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును కూడా పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడమైనది.

🏠 Home