EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సోమవారం  ప్రజావాణి రద్దు ... 28 న బీసీ కమీషన్ రాకతో నిర్ణయం

    Author REPUBLIC HINDUSTHAN | 26 Oct 2024, 04:41 PM |
    సోమవారం  ప్రజావాణి రద్దు ... 28 న బీసీ కమీషన్ రాకతో నిర్ణయం


      

             ---   జిల్లా పాలనాధికారి రాజర్షి షా


    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ కలెక్టరేట్ :

    తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 28 న అదిలాబాద్ కు రానున్న సందర్భంగా  సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని శనివారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా  ఒక ప్రకటనలో తెలిపారు.




    ఇవి కూడా చదవండి




    అదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ , మంచిర్యాల ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 28 న  అదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో  ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి, బీ.సీ వెల్ఫేర్ కమిషనర్ల తో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని , ఈ నేపథ్యం లో ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని, ప్రజలు దీనిని గమనించి సోమవారం కలెక్టరేట్ కు రావద్దని జిల్లా పాలనాధికారి ఆ ప్రకటన లో తెలిపారు.