EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వర్టికల్స్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేసిన రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి

    Author REPUBLIC HINDUSTHAN | 31 May 2022, 03:16 PM |



    -- జిల్లా నుండి నలుగురు పోలిస్ అధికారులు ప్రశంసా పత్రాలు పొందడం హర్షణీయం

    -- అధికారులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి



    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

    రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో స్థాయిలో పని విభాగాలను విధుల నిర్వహణలో 17 ఫంక్షనల్ వర్టికల్ గా వర్గీకరించారు. అందులో భాగంగానే 2021 సంవత్సరానికి గాను ఫంక్షనల్ వర్టికల్ స్ లో రాష్ట్రంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 187 మంది పోలీసులకు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి మంగళవారం రొజు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో వర్టికల్స్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన నలుగురు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.


    ఇవి కూడా చదవండి


    ప్రశంస పత్రాలు అందుకున్న అధికారులు
    1) ఎం నైలు - సీఐ బోథ్ - జిల్లా వర్టికల్స్ ఇన్ఛార్జ్
    2) ఏ హరిబాబు - ఎస్ఐ అదిలాబాద్ రూరల్ - ఇన్వెస్టిగేషన్ వర్టికల్
    3) భూక్యా బని లాల్ - మావల పోలీస్ స్టేషన్ - పెట్రో కార్ వర్టికల్
    4) రాథోడ్ గోపాల్ - బోథ్ పోలీస్ స్టేషన్ - స్టేషన్ రైటర్ వర్టికల్
    ఈ నలుగురు అధికారులు ప్రశంసాపత్రాలను సంబంధిత వర్టికల్స్ లో స్వీకరించారు.



    ప్రశంసా పత్రాలు అందజేస్తున్న రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి


    ఈ నలుగురు అధికారులను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ప్రదర్శన చేసిన ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం లభిస్తుందని జిల్లా పోలీసు యంత్రాంగం అందరూ తమకు సాధ్యమైనంతవరకు మంచి ప్రదర్శనను పనితనాన్ని చూపించాలని పేర్కొన్నారు. ఈ నలుగురు అధికారులు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకోవడం సంతోషంగా ఉందని, తమ కష్టానికి ప్రతిఫలం లభించిందని తెలిపారు.