EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తి రిమాండ్‌

    Author REPUBLIC HINDUSTHAN | 21 Oct 2025, 09:04 PM |
    సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తి రిమాండ్‌


    Adilabad:  శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు. మంగళవారం టూటౌన్‌లో వివరాలను వెల్లడించారు.[view_clip]


    ఆదిలాబాద్‌ పట్టణంలోని బొక్కల్‌గూడకు చెందిన అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ రషీద్‌ ఖాన్‌ పాత వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. పోలీసులు ఓ వ్యక్తిని కొట్టినట్లు ఉన్న ఈ వీడియో పోస్టు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైన శాంతిభద్రతలు, విద్వేశాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూప్‌ అడ్మిన్లు ఇలాంటి పోస్టులు పెట్టకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


    [view_clip

    ఇవి కూడా చదవండి