EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆదిలాబాద్‌లో భారీ భూమి కుంభకోణం బట్టబయలు

    Author REPUBLIC HINDUSTHAN | 21 Sep 2025, 07:20 AM |
    ఆదిలాబాద్‌లో భారీ భూమి కుంభకోణం బట్టబయలు



    మావల పోలీస్‌ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్



    నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు

    ఆదిలాబాద్ : మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం బట్టబయలు అయింది.

    ఆదిలాబాద్ పట్టణంలో కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠాను మావల పోలీసులు బట్టబయలు చేశారు.

    అరెస్టైన నిందితులు:
    నానం వెంకటరమణ (60) – RWS D.E.E., టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్
    ఉష్కం @ ఉష్క మల్ల రఘుపతి (43) – మావల, ఆదిలాబాద్
    బెజ్జవార్ సంజీవ్‌కుమార్ (49) – ప్రభుత్వ ఉద్యోగి, ఆయుష్ విభాగం, రిమ్స్ ఆదిలాబాద్

    పరారీలో ఉన్నవారు:
    దుప్పలపూడి అశోక్ – సబ్ రిజిస్ట్రార్

    కుంభకోణం ఎలా జరిగిందంటే?

    బాధితుడు మిల్లింద్ కొర్తల్‌వార్ ఫిర్యాదుతో కేసు వెలుగులోకి వచ్చింది.

    నిందితులు ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించారు.

    సబ్ రిజిస్ట్రార్ అశోక్‌కు ₹7 లక్షల లంచం ఇచ్చి అదే ప్లాట్లను మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు.

    సుమారు ₹2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ.


    మావల సీఐ కర్ర స్వామి దర్యాప్తులో భాగంగా నిందితుల పై  సెక్షన్లు IPC 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు

    ఇవి కూడా చదవండి



    పరారీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్‌ పై కూడా కేసు నమోదు చేశారు.

    ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.