EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

    Author REPUBLIC HINDUSTHAN | 04 May 2025, 03:19 PM |





    అదిలాబాద్ జిల్లా : ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో "భగీరథ మహర్షి" జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా  హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.







    **శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా నిర్వహణ**



    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు వైశాఖ మాసం శుక్లపక్ష సప్తమి రోజైన ఈ రోజు (మే 4, 2025) అధికారికంగా ఘనంగా జరిగాయి. కఠోర తపస్సుతో పవిత్ర గంగానదిని దివి నుండి భువికి తీసుకొచ్చి, సగరుల చితాభస్మంపై పారించి తన పూర్వీకుల శాపవిముక్తిని కలిగించిన మహాతపస్వి భగీరథ మహర్షి. ఈయన సగర ఉప్పర కుల తిలకంగా, భూలోకంలో సకల ప్రాణుల దాహార్తిని తీర్చిన మహనీయుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి సగర సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు.


    ఇవి కూడా చదవండి


    ఈ జయంతి వేడుకలు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి.  



     ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి రాజర్షి షా హాజరై నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో సగర సంఘం నాయకులు, మహిళా సంఘం, యువజన సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



    ఈ కార్యక్రమంలో సగర సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాకేలె శంకర్ సగర, ప్రధాన కార్యదర్శి ఐ. నేలే జ్ఞానోబా సగర, కోశాధికారి మాదంశెట్టి శంకర్ సగర, రాష్ట్ర నాయకులు సాయినాథ్ కలుబురిగే సగర, సభ్యులు గోపాల్ ఏ. గాడే సగర, సంజు రాఖీలే సగర, అయినీలే నారాయణ సగర, ఐ. నీలే అరవింద్ సగర, బాలాజీ సగర, మారుతీ సగర, అమోల్ సగర, అయినీలే గణేష్ నగర్‌తో పాటు మహిళా సంఘం, యువజన సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగీరథ మహర్షి ఆశయాలను స్మరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌లకు, బీసీ సంఘ నాయకులకు, మీడియా మిత్రులకు సగర సంఘం తరపున  శుభాకాంక్షలు తెలిపారు.