EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రెగ్యులర్ చేయాలని సీఆర్టీల అర్ధ నగ్న ప్రదర్శన

    Author REPUBLIC HINDUSTHAN | 31 Dec 2024, 06:23 AM |



    16 వ రోజుకు చేరిన సమ్మె...

    రిపబ్లిక్ హిందుస్థాన్ , ఉట్నూర్ : ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయాలని మరియు ఇతర డిమాండ్లతో సీఆర్టి లు గత కొన్ని రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసి, 61 సంవత్సరాల ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
    బేసిక్ పే స్కేల్ తో కూడిన వేతనం తో పాటు సర్వీస్ రిజిస్టర్‌ ను కల్పించాలని (సమాన పని కి - సమాన వేతనం) డిమాండ్ చేశారు.



    సమ్మె చేస్తున్న సీఆర్టీ ఉద్యోగులు

    ఇవి కూడా చదవండి



    గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలనీ ,  మహిళలకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మరియు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలనీ అన్నారు.
    CRT లకు P F సౌకర్యం తో పాటు ఆరోగ్య భద్రత / ఆరోగ్య కార్డ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
    విధి నిర్వహణ వ్యవధిలో మరణిస్తే మరణ బీమా - 10 లక్షలు ఇవ్వాలని కోరారు.
    పదవీ విరమణ ప్రయోజనాలు - 30 లక్షలు ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా డిమాండ్ల సాధన కోసం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
    .
    .
    .