EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రమాద వషాత్తు గుంతలో పడి బాలిక మృతి....

    Author REPUBLIC HINDUSTHAN | 16 Sep 2024, 01:32 PM |

    ప్రమాద వషాత్తు గుంతలో పడి బాలిక మృతి.

    రిపబ్లిక్ హిందూస్తాన్,బజార్ హత్నూర్,
    ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామ సమీపంలోని స్టోన్ క్రెషర్లో పని చేస్తున్న కూలీ కుటుంబానికి చెందిన ఒక బాలిక సంజన ప్రమాద వషాత్తు సోమవారం రోజు నీటి గుంతలో పడి మృతి చెందింది. ఛత్తిష్ ఘడ్ రాష్ట్రానికి చెందిన భరత్ కుటుంబం వచ్చి పిప్పిరి వద్ద గల స్టోన్ క్రెషర్ లో కూలీ పని చేస్తున్నారు. అతని 12 సంవత్సరాల కూతురు సంజన క్రెషర్ వద్ద గల గుంత వద్దకు నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయి మృతి చెందినదని బజార్ హత్నూర్ పోలీస్ అధికారి తెలిపారు. బాలికకు పిట్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.