EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • Krishna Floods: ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..ప్రకాశం బ్యారేజ్ గేట్లు మళ్లీ ఎత్తివేత..!!

    Author REPUBLIC HINDUSTHAN | 08 Sep 2024, 02:22 AM |
    Krishna Floods: ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..ప్రకాశం బ్యారేజ్ గేట్లు మళ్లీ ఎత్తివేత..!!


    Heavy Rains Cause Flooding in Krishna Basin: కృష్ణా నది వద్ద మళ్లీ వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు మళ్లీ ఎత్తేశారు. ప్రకాశం బ్యారేజ్ ఎక్కువ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు కృష్ణ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదికి వరద.. మళ్లీ భయంకరమైన స్థాయిలో పెరిగింది.

    దీంతో ప్రకాశం బ్యారేజ్ 65 గేట్లు ఎత్తారు అధికారులు. ఈ నేపథ్యంలోనే 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం పడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ జిల్లాలో ఉన్నవారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.