EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి: రిషబ్ శెట్టి

    Author REPUBLIC HINDUSTHAN | 21 Aug 2024, 06:33 AM |
    బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి: రిషబ్ శెట్టి


    బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయని హీరో రిషబ్ శెట్టి అన్నారు.
    బాలీవుడ్‌ సినిమాలపై కన్నడ స్టార్‌ హీరో రిషబ్‌ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని భారతీయ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే తాను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ‘నా దేశం.. నా రాష్ట్రం.. నా భాష.. వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా’ అని రిషబ్‌ అన్నారు.