EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డీపీఆర్ఓ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు

    Author REPUBLIC HINDUSTHAN | 08 Feb 2023, 11:26 AM |


    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖధికారి భీమ్ కుమార్ తీరుపై జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. తరచూ తమ విధులకు ఆటంకం కలిగించే విధంగా డీపీఆర్ఓ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రిమ్స్ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శిస్తున్నారని కవరేజ్ కోసం రావాలని డిపిఆర్ఓ సమాచారమివ్వగా కెమెరామెన్లు జర్నలిస్టులు అక్కడికి చేరుకున్నారు. రిమ్స్ లో కలెక్టర్ ఫోటోలు తీస్తున్న నమస్తే తెలంగాణ స్టాఫ్ కెమెరామెన్ రాజ్ కిరణ్ కెమెరాను డీపీఆర్ఓ లాక్కోవడమే కాక దురుసుగా ప్రవర్తించిన తీరును జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా నిలుస్తూ విలువైన సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్న జర్నలిస్టుపై డీపీఆర్ఓ వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు డీపీఆర్ఓ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, కెమెరా మెన్ లు ఉన్నారు.