EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

    Author REPUBLIC HINDUSTHAN | 06 Sep 2022, 09:40 AM |


    రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : నేరడిగొండ మండల నూతన ప్రెస్ క్లబ్ ఇటీవల ఎన్నుకున్న సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తోపాటు ఆర్డీవో రాథోడ్ రమేష్ లను మర్యాదపూర్వకంగా కల్సుకోని పుష్ప గుచ్చాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు.  నేరడిగొండ మండల విలేకరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ ఆర్డీవో ఇద్దరి దృష్టికి తీసుకువచ్చారు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో విలేకరులంటే ప్రజల సమస్యలను అధికారుల తోపాటు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకురావటం తోపాటు ప్రజాప్రతినిధులు అధికారులు చేపడుతున్న పనులను ప్రజల దృష్టికి తీసుకురావటoలో ప్రత్యేక పాత్ర పోషిస్తారని అన్నారు విలేకరుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొప్పుల ప్రమోద్,  గౌరవ అధ్యక్షుడు షేక్ ఫసియోద్దీన్,  ఉపాద్యాక్షుడు ఏలేటి సృజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జాదవ్ రామారావు,  సంయుక్త కార్యదర్శి అజయ్, కోశాధికారి నలిమేల పోతన్న,  ప్రధాన సలహదారులు షేక్ అజర్,   మదన్  తదితరులు ఉన్నారు.