EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దుబాయిలో భారత కాన్సులేట్ కు కన్సుల్ జనరల్ గా నియమితులైన తొలి తెలంగాణ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన GWAC కార్యవర్గం.

    Author REPUBLIC HINDUSTHAN | 12 Aug 2026, 11:19 PM | INTERNATIONAL, NATIONAL, saudi arabia
    దుబాయిలో భారత కాన్సులేట్ కు కన్సుల్ జనరల్ గా నియమితులైన తొలి తెలంగాణ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన GWAC కార్యవర్గం.

    సౌదీ అరేబియా:
    నూతన కన్సుల్ జనరల్ గా దుబాయిలో పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ డా. ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన GWAC(Gulf Workers Awareness Center) కార్యవర్గం.

    కాన్సుల్ జనరల్ గారికి ఒక వినతిపత్రం అందించి దుబాయి మరియు నార్తర్న్ ఎమిరేట్స్ లో తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, మరి ముఖ్యంగా తెలంగాణ నుండి వచ్చిన మరియు ప్రస్తుతం వస్తున్న బ్లూ కలర్ వర్కర్స్ కు కల్పించాల్సిన అవగాహన గురించి చర్చించాము.

    ప్రధానంగా గుల్పారం అలవాటు ఉండి దుబాయి వస్తున్న తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చాల వివరంగా కాన్సుల్ జనరల్ గారు తెలుసుకున్నారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు, దుబాయిలో కూడ కొన్ని డిఅడిక్షన్ సెంటర్స్ తో మాట్లాడుతున్నామని ఇక్కడ కూడ వారికి మెడికల్ సహాయం అందించే విషయంలో దృష్టి పెడతామని తెలిపారు.

    గల్ఫ్ కార్మికులకోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి నిర్మించే విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో ల్యాండ్ ఆలోట్మెంట్ త్వరలోనే పూర్తయి నిర్మాణం మొదలుతుందని తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    మళ్లీ ఒకసారి పూర్తిస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకుని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి డిస్కస్ చేద్దామని వాటి పరిష్కారం కోసం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్దామని తెలిపారు.

    మా GWAC కోరిక తెలుగు అధికారులు ఎంబసీ మరియు కాన్సులేట్ లలో ఉండేలా పోరాటం చేసిన విషయం తెలిపి, మా కోరిక నెరవేరిందని ఏకంగా తమ ప్రాంతానికి చెందిన తెలంగాణ అధికారి దుబాయి కాన్సుల్ జనరల్ నియమింపబడటం చాల ఆనందాన్ని ఇచ్చిందని, కాన్సుల్ జనరల్ ఉన్నన్ని రోజులు విజయవంతంగా లీడ్ చేయడానికి మరియు తెలంగాణ కార్మికులకు సేవలందించడంలో మేము ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని కాన్సుల్ జనరల్ శ్రీ డా. ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి గారికి తెలిపిన GWAC బృందం.

    ఈ సమావేశంలో కాన్సుల్ జనరల్ ను కలిసిన వారిలో కృష్ణ దోనికేని, శ్రీనివాస్ రెండ్ల, నరేందర్ గడ్చంద, అనిల్ కుమార్ కటుకం, మోతే రాములు, సతీష్ దారం, నరేష్ కల్లెడ, బాబు బోస, సముద్రాల శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, శంకర్ లౌడ్య, సుమన్ చింతన్ పల్లి మరియు శ్రీనివాస్ ఎలకపల్లి ఉన్నారు.

    కృష్ణ దోనికేని
    వ్యవస్థాపక అధ్యక్షులు
    GWAC( Gulf Workers Awareness Center)

    #CGIDubai, #DrVishnuVardhanReddy #GWAC