SI EXAMS : ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు : ఎస్పీ
🔶 జిల్లా కేంద్రం నందు 8 సెంటర్లలో 3554 విద్యార్థులకు పరీక్ష 🔶 సమయానికంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు -- జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శుక్రవారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష కోసం ఏర్పాటు చేసిన బందోబస్తు సిబ్బందితో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రం నందు ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష కోసం 8 పరీక్షా కేంద్రాలలో 3554 మంది విద్యార్థులు రాత పరీక్షను రాయనున్నారు. దీనికి...