భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి : జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బైక్ ర్యాలీకి ఘనంగా ఆదిలాబాద్ జిల్లా నుండి వీడుకోలు పలికిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుండి ఢిల్లీ వరకు ఈనెల 15వ తారీఖున చేరుకునేలా 40 మంది సిబ్బందితో 20 మోటార్ సైకిల్ లతో బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ మంగళవారం రోజు ఆదిలాబాద్ పట్టణంలోకి ప్రవేశించి బుధవారం ఉదయం మహారాష్ట్ర రాష్ట్రానికి బయలుదేరింది. ఈ ర్యాలీకి ఆదిలాబాద్ జిల్లా పోలీస్ తరఫున జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఘనంగా వీడ్కోలు తెలిపారు. ఈ ర్యాలీ లో దక్షిణ భారతదేశం నుండి సౌత్ సెంట్రల్ రైల్వే,...