ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి

- జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రక్తదానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది ప్రసవానికి వచ్చిన ఆదివాసి మహిళ రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు అత్యవసరంగా స్పందించి రక్తదానం చేసిన జిల్లా ఎస్పీ తనను ఆదర్శంగా తీసుకొని యువత, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : బుధవారం అర్ధ రాత్రి రిమ్స్ ఆసుపత్రి నందు రక్తహీనతతో ప్రసవానికి వచ్చిన 8 నెలల గర్భిణీ గాదిగూడ మండలం చింతగూడ గ్రామానికి చెందిన రాంబాయి అనే మహిళకు అత్యవసరంగా రక్తం కావలసినప్పుడు ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి స్పందించి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా...