Ichoda Floods : ఇచ్చోడా నీట మునగడానికి కబ్జాలే కారణమా...!❓️❓️<br>అధికారుల నిర్లక్ష్యమా...!?

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : వాగులు, మురికి కాలువల కబ్జా ఇచ్చోడా పట్టణ ప్రజల పాలిట శాపంగా మారాయి. కొందరు అక్రమార్కులు మురికి కాలువ లను , ఇచ్చోడా పట్టణ కేంద్రం నుండి వర్షపు నీరు వెళ్ళడానికి ఉన్న ప్రధాన వాగును కబ్జా చేయడం తో ప్రతి యేటా ఇచ్చోడా పట్టణం నీట మునుగుతుంది. ప్రస్తుతం కురుస్తున్న అతి భారీ వర్షాలకు సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో పలు కాలనీలలో ఇండ్లలో వరద చేరడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. మండల కేంద్రం లోని సుభాష్ నగర్, రంజాన్ పుర మరియు ఇస్లాంపూర కాలనీల్లో వరద ప్రవాహంలో కొందరి ఇండ్ల నుండి టీవీ లు, ఫ్రీడ్జీలు నిత్యావసర...