24 గంటలు అప్రమత్తంగా ఉండాలి <br>-- జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
🔶 బోథ్ మండలం పొచ్చెర జలపాతాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ 🔶 అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచన 🔶 జిల్లా పోలీసు అధికారులందరికీ సూచనలు ఇచ్చిన జిల్లా ఎస్పీ 🔶 ఎటువంటి అత్యవసర సమయంలోనైనా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్య జిల్లా పోలీసు యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బోథ్ మండలం పొచ్చర జలపాతాన్ని జిల్లా ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా...