Ichoda: పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని దాబా బి గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితం పై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మృతుని భార్య మాన్నే ఆశాబాయి మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలం దాబా బి గ్రామానికి చెందిన మాన్నే గోవింద్(46) గత ఆరు సంవత్సరాలుగా అస్తమ తో పాటు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రిలు తిరిగిన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆరోగ్యం విషయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు . అయితే గత నాలుగు రోజుల నుండి అర్షమొలల నుండి రక్తస్రావం తీవ్రం కావడంతో ఆ నొప్పి భరించలేక...