Wrngl RL: జోరుగా రేషన్ బియ్యం దందా
🔶 చిన్న బండితో పెద్ద వ్యాపారం 🔶 మోటార్ సైకిళ్లపై రేషన్ బియ్యం రైస్ మిల్లులకు తరలింపు 🔶 ఏమాత్రం పట్టించుకోని అధికారులు రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జోరుగా రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగుతోంది. మండలంలోని ఆసరా వెళ్లి, కొండాపురం, మేడపల్లి, గుండ్ల పహాడ్, నరక పేట, రుద్రగూడెం, శనిగరం తదితర గ్రామాల నుండి రేషన్ బియ్యాన్ని సేకరించి మండల కేంద్రంలోని రైస్ మిల్లులకు తరలిస్తూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అసలు పట్టించుకోకపోవటంతో ఆ దందా రోజురోజుకూ విస్తరిస్తోంది.ప్రతి నెల రేషన్ బియ్యం సైక్లింగ్ వ్యాపారం నిరంతరం జరుగుతోంది. రేషన్ సరుకులు పక్కదారి...