పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనది - జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి
◾️బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి ◾️సక్రమంగా విధులు నిర్వర్తించని వారిని ఉపేక్షించేది లేదు.. ◾️ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్ పాత్ర కీలకమైనది ని జిల్లా ఎస్ పి డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక అదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మొదటగా పోలీస్ స్టేషన్ లో పెండింగ్లో ఉన్న కేసుల స్థితిగతులను, వివరాలను తెలుసుకొని వాటినీ సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తు నందు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు....