జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అదిలాబాద్ ఆధ్వర్యంలో

రేపు బోథ్ లో మెగా వైద్య శిబిరం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అదిలాబాద్ వారు బోథ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గురువారం రోజు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ డా.నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య నిపుణులు అయిన స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల  , ఎముకలు, దంతాలు, కళ్ళు, ముక్కు చెవి గొంతు, చర్మ , శస్త్రచికిత్స, జనరల్ మెడిసిన్ మొదలగు  ప్రత్యేక వైద్య నిపుణులచే ఉచిత చికిత్సలు  అందించబడతాయని తెలిపారు. గర్భిణీలకు స్కానింగ్,రక్త పరీక్షలు మందులు అందించబడుతాయని, ఆయుష్మాన్ భారత్ కార్డు రిజిస్ట్రేషన్...