జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

🔶 ఏప్రిల్ నెల 30 వరకు 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు, ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రజా శాంతికి భంగం కలగకుండా, జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగించడానికి ఈ నెల 30 వరకు 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. జిల్లాలో ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలన్నా ముందస్తుగా డిఎస్పి, లేదా ఆపై అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి...