ప్రాణం తీసిన అతివేగం…బైక్ అదుపు తప్పి ఒకరి మృతి
ఇద్దరికి తీవ్రగాయలు… రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదిలాబాద్ కు చెందిన ముగ్గురు యువకులు ఇచ్చోడ మండల కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో బైక్ ను అతివేగంగా అజాగ్రత్తగా నడపటం వల్ల నాగ్నూర్ వార్ విక్రమ్ (23) అనే యువకుడికి తీవ్రగాయలై సంఘటన స్థలం లోనే మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇచ్చోడ ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ కు చెందిన నాగ్నూర్ విక్రమ్, రామేల్లి సాయి, పార్థ సాయి తేజ అనే ముగ్గురు స్నేహితులు పల్సర్ బైక్ పై పని నిమ్మిత్తం ఉదయం ఇచ్చోడా మండల కేంద్రానికి వచ్చారు. పనులు ముగించుకుని ఆదిలాబాద్ వైపు తిరుగు...