సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి
• వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతేక ఏర్పాట్ల • కోవిడ్ వైరస్ వ్యాప్తి, నిరోదక చర్యలు, వ్యాక్సినేషన్, తదితర అంశాలపై సమీక్ష • ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్యెల్యే అధ్యక్షతన జరిగిన కోవిడ్ వైరస్ వ్యాప్తి, నిరోదక చర్యలు, వ్యాక్సినేషన్, తదితర అంశాలపై కోవిడ్ మూడవ విడత ఓమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి జరుగుతున్న దృష్ట్యా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తు ఏర్పాట్లపై ఆయన...