ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 317ను పూర్తిగా మినహాయించాలి

ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా ఆధ్యక్షులు ఉయిక లక్ష్మీన్ డిమాండ్ రిపబ్లిక్ హిందూస్తాన్, గుడిహత్నూర్: ఈ రోజు ఆదివాసి ప్రజా సంఘాల పిలుపు మేరకు గూడిహత్నుర్ మండల కేంద్రంలో ఆదివాసి సేన ఆధ్వర్యంలో మార్కెట్ ను సంపూర్ణంగా బంద్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సేన జిల్లా అధ్యక్షులు ఉయిక లక్ష్మీన్ మాట్లాడుతూ జీవో నంబర్ 317 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగుల బదిలీలను వారి స్థానికత ఆధారంగానే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు మా ఉద్యోగాలు, నీళ్లు, వనరులను దోచుకుంటున్నారని చేప్పి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోనల్ బదిలీల...