ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అందని వైద్యం
ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం, సోమవారం గర్భిణీ స్త్రీలకు సేవలు సున్నా... వికారాబాద్,ప్రతినిధి,(రిపబ్లిక్ హిందుస్థాన్): బషీరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు కరువయ్యాయి. గర్భిణీ స్త్రీల పేర్లు నమోదు చేసుకోవడం తప్ప వైద్యం అందించే దాఖలాలు లేవు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య అధికారిణి కి జిల్లా ప్రోగ్రాం అధికారి గా బాధ్యతలు అప్పగించడంతో వారు జిల్లా కే పరిమితమయ్యారు. ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం, సోమవారం గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు తప్పనిసరిగా అందించాలని వైద్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా కానీ ఇక్కడ మాత్రం వైద్య సేవలు అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి....