రైతులకు అందుబాటులో శనగ విత్తనాలు

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా రైతులకు నంద్యాల శెనగ 1 ( NBeg-3) రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహన్ తెలిపారు. శనగ విత్తనాలు వందరోజుల కాలపరిమితితో ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడినిస్తాయని తెలిపారు. అదేవిధంగా ఈ విత్తన రకం కొంతవరకు వేడిని , బెట్ట ను తట్టుకుంటాయని తెలిపారు. విత్తనాలు కూడా మధ్యస్థ లావుగా ఉంటాయని తెలిపారు. ఎకరానికి 30 కిలోలకు విత్తుకోవాలని రైతులను సూచించారు. కిలో విత్తనాలు ధర వంద రూపాయలు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విత్తన శుద్ధి చేసే విధానాన్ని వివరించారు. శనగ...