అడవుల సంరక్షణ కు పకడ్బందీగా చర్యలు... అన్యాక్రాంతం కాకుండా పోలీస్ ప్రొటెక్షన్ : సీఎం కేసీఆర్
పోడు భూముల సమస్యల త్వరలో కార్యాచరణ ప్రారంభించడానికి కసరత్తు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం లో పలు అంశాల పై చర్చ... రిపబ్లిక్ హిందుస్థాన్ : రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అక్టోబర్ మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఒక్క గజం జాగ అటవీ భూమి భవిష్యత్తులో అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని, దురాక్రమణలు అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలకైనా వెనకాడబోదన్నారు. పోడు సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష...