రైతన్నల ఆత్మహత్యల్లో తేడా.!

★ రైతుబీమా వచ్చిన తర్వాత 49,755 మంది మరణం ★ గత ఏడాది 4వ స్థానంలో తెలంగాణ ★ లెక్కల్లో తేడాలు ఎందుకు.? ( పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు, 'రైతు ఆత్మహత్యల ' పై అందిస్తున్న ప్రత్యేక కథనం) రైతులకు రైతుబందు ఇస్తున్నారు. ఇంకెన్నో చేస్తున్నాం అంటుంది ప్రభుత్వం. అయినా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగటం లేదు. దేశ రైతల ఆత్మహత్యల జాబితాలో తెలంగాణ 4వ స్థానం ఉన్నట్లు నివేదికలు చెపుతున్నాయి. రాష్ట్రంలో కూడా అన్నదాతల ఆత్మహత్యలపై ప్రభుత్వం చెపుతున్నా దానికి, దేశంలో ఆత్మహత్యలపై నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీ‌ఆర్‌బీ) నివేదిక లెక్కలకు పొంతన ఉండటం లేదు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి.?...