ఏకంగా ఊరి ప్రధాన కాలువ పైనే భవంతులు కట్టేశారు......
ఏళ్ళు గడుస్తున్నా చర్యతిసుకొని అధికారులు... గతంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో కూల్చే ఆర్డర్ ఇచ్చిన అధికారులు..... అక్రమ కట్టడాలు కూల్చివేత చేస్తున్న క్రమంలో అనూహ్యంగా ఆపివేసిన వైనం .... రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండల కేంద్రంలో ప్రధాన పెద్ద మురికి కాలువను మూసివేసి దాని పై పెద్ద పెద్ద భవంతులు కట్టేశారు. ఏ మాత్రం వర్షం పడిన ఇప్పుడు వర్షపు నీరు ఇళ్లలో చేరి సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇదే విషయమై స్థానికులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫోటోలు చూడండి.... ఏకంగా చిన్న బ్రిడ్జ్ కి ఎదురుగా అంటే బ్రడ్జికి అనుకుని కాలువ పైనే కట్టిన నిర్మాణం...