సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం..... : జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్
రెండురోజుల క్రితం రోడ్డు సౌకర్యం లేక మరణించిన మడావి రాజుబాయి భర్తకు 25 వేల సహాయం అందజేత.... భవిష్యత్తు లో ఇలా జరగకుండా చూస్తాము.... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : గ్రామస్తుల ఫీడ్ బ్యాక్ తీసుకొని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గాదిగూడ మండలం కొనికస కొలంగూడా లోఈ నెల 22 న మరణించిన గర్భినీ మాడావి రాజుబాయి భర్త మాడావి జంగు ను కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి మంగళవారం రోజున పరామర్శించారు. తాత్కాలిక రిలీఫ్ క్రింద 25 వేల రూపాయల చెక్కును జంగు కు అందజేశారు. వాగుదాటి కొనికస గ్రామానికి వెళ్తున్న కలెక్టర్ సిక్త...