ప్రేమ వ్యవహారంలో దళిత యువకుడి హత్య కేసు ఛేదన
48 గంటల్లోనే ఆరుగురు నిందితుల అరెస్ట్ – ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఆదిలాబాద్, జూన్ 21: నేరడిగొండ మండలంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఎస్సీ యువకుడి హత్య కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ వెల్లడించారు. నేరడిగొండ మండలం పెద్దబుగ్గారం గ్రామానికి చెందిన నాతరి సతీష్ (23) ఈ నెల 17న కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం జూన్ 19న కరాత్‌వాడ చెరువులో అతని మృతదేహం లభ్యమవడంతో కేసును...