ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల: విద్యావ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ తో కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాసంస్థల అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ గోడ, అదనపు గదులు ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని...