ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, భూ సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం అత్యంత కీలకమని, బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను నిర్దేశిత గడువులోగా క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా 'భూ భారతి', సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన...