*దేశ చరిత్రలో మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దిశ నిర్దేశించింది - మంత్రి పొన్నం ప్రభాకర్*
జూన్ 10: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా దేశానికే ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, వారిని ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు. మహిళా శక్తి పథకం కింద మండల మహిళా సమాఖ్యలు తమ సొంత నిధులైన రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 TGSRTC బస్సులను కొనుగోలు చేసి సంస్థకు అద్దెకు ఇవ్వడం మహిళల ఆర్థిక స్వావలంబనకు, సమిష్టి శక్తికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఒకప్పుడు...