రేపు కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి
కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాలు.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం *ఏర్పాట్ల పర్యవేక్షణకు వందే భారత్‌లో కాగజ్‌నగర్‌కు చేరుకున్న మంత్రి జూపల్లి* *తోటి ప్రయాణికులతో మంత్రి ముచ్చట్లు.. రైలులోనే భోజనం* హైదరాబాద్, మే 31: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో కీలక ఘట్టానికి చేరుకోనుంది. తొలి విడత ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశాలకు సిద్ధమవుతుండగా, రెండో విడతకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో...