ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. గ్రామ సభలలో కార్యక్రమం ప్రారంభంలో ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినిపించి, అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని చెప్పారు. రైతు భరోసా లబ్ధిదారుల జాబితా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను సాధ్యమైనంతవరకు గ్రామసభలో చదివి వినిపించాలని ఆదేశించారు. ఇప్పటివరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, జూన్ 2...