సజావుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా...
సజావుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా... * రాష్ట్ర, జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు.. నోడల్ ఆఫీసర్ల నియామకం * పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: పెట్రోలో, డీజిల్, గ్యాస్ సరఫరాకు సంబంధించి సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్...