భద్రాచలంలో ఆద్యంతం వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక

351 కోట్లతో తొలిదశ దేవాలయ పునరాభివృద్ధి పనులు -గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆలయ పునరాభివృద్ధి భూమిపూజలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పేలా, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్నిదక్షిణఅయోధ్యగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ముందుగా భద్రాచలం దేవాలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా రూ. 351 కోట్లతో చేపట్టనున్న తొలిదశ అభివృద్ధి పనులకు, గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమిపూజ చేశారు. ఈ భూమిపూజలో...