బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వచ్చి.. చివరకు విగతజీవిగా స్వగ్రామానికి చేరిన గడ్డం మోహన్*
రియాద్: బతుకుదెరువు కోసం, కుటుంబాన్ని పోషించాలనే ఆశతో సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వచ్చిన గడ్డం మోహన్ గారు అనేక కష్టాలను ఎదుర్కొని, చివరకు విగతజీవిగా స్వగ్రామానికి తిరిగి వెళ్లడం పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి గ్రామానికి చెందిన *గడ్డం మోహన్ గారు* ఎప్పటిలాగే రోజువారీ పనికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనతోటి కార్మికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం బ్రెయిన్ సర్జరీ అవసరమని నిర్ధారించి శస్త్రచికిత్స చేశారు. అయితే, మోహన్ గారి కుటుంబం తీవ్ర పేదరికంలో ఉండటంతో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో సహాయం కోసం *SATA రియాద్...