రియాద్‌లో తెలంగాణ కార్మికుడు మృతి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాటా సహకారం
రియాద్: తెలంగాణకు చెందిన వలస కార్మికుడు శ్రీ గడ్డం మోహన్ రియాద్‌లోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు మృతి చెందారు. మోహన్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, ఆయన కుమారుడు శ్రీ గడ్డం అరుణ్ చేసిన విజ్ఞప్తి మేరకు సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మచ్చ తెలంగాణ ప్రభుత్వంలోని సీఎం ప్రవాసి ప్రజావాణి (NRI సెల్), కుటుంబ సభ్యులు, ఆసుపత్రి అధికారులు, భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేస్తూ, మోహన్‌ను అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలనీ విన్నవించారు. అయితే, చికిత్స పొందుతున్న సమయంలోనే శ్రీ గడ్డం మోహన్ మృతి...